Share News

Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 09:14 PM

ఓ దొంగ రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లాడు. దుకాణ షెట్టర్ పైకి ఎత్తి, కింద నుంచి లోపలికి దూరాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా కూడా ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది దొంగ భక్తి కాదు.. పరమ భక్తి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

దొంగలు చోరీ సమయాల్లో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు దొంగలు చోరీ చేస్తూ బాత్‌రూముల్లో స్నానాలు చేస్తే.. మరికొందరు ఏకంగా వంటింట్లో చికెన్, మటన వండుకుని మందు తాగుతూ భోజనం చేస్తుంటారు. ఇంకొందరు దొంగలైతే ఇంటి యజమానులపై జాలి పడి ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లకుండా తన జేబులోని నగదును కూడా అక్కడే పెడుతుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ చోరీ చేస్తూ చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ (Thief) రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లాడు. దుకాణ షెట్టర్ పైకి ఎత్తి, కింద నుంచి లోపలికి దూరాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా కూడా ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షట్టర్ కింద నుంచి లోపలికి దూరే సమయంలో కాళ్లు టేబుల్‌కు తాకి, దేవుడి పటం కిందపడిపోతుంది.

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం గ్యారెంటీ.. విరిగిపోని మంచాన్ని ఎలా తయారు చేశాడంటే..


దేవుడి చిత్రపటం కింద పడగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. కాళ్లు వెనక్కు తీసుకుని తల ముందుకు పెట్టి లోపలికి వస్తాడు. వచ్చీరాగానే తాను చేసిన తప్పునకు మన్నింపు కోరుతూ దేవుడి చిత్ర పటాన్ని చేతిలోకి తీసుకుని కళ్లకు అద్దుకుంటాడు. ఆ తర్వాత దేవుడి పటాన్ని గోడకు తగిలించి, తన దొంగతనాన్ని యథావిధిగా కొనసాగిస్తాడు. ఇలా చేసేది దొంగతనమే అయినా భక్తిలో మాత్రం ఎవరికీ తీసిపోని విధంగా ప్రవర్తిస్తాడు.

Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ ఘటన మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దొంగలు కూడా ఇంట్లో పూజ చేసే చోరీకి వస్తారు.. ఎందుకంటే ఇది వారి రోజు విధి’’.. అంటూ కొందరు, ‘‘దొంగలకూ దేవుడిపై భక్తి ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6,700 కి పైగా లైక్‌లు, 6.28 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీధి సందులో నిలబడ్డ యువతి.. సమీపానికి వచ్చిన అంకుల్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Mar 22 , 2025 | 09:14 PM