Share News

Viral Video: కూటి కోసం కోటి విన్యాసాలు.. ఈ చిరు వ్యాపారి రైలు ఎలా ఎక్కుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 09 , 2025 | 08:49 PM

కూటి కోసం కోటి విద్యలు.. అన్న చందంగా కుటుంబ పోషణ కోసం కొందరు ప్రాణాలకు తెగించి మరీ పనులు చేస్తుంటారు. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా తెగించి మరీ పని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

Viral Video: కూటి కోసం కోటి విన్యాసాలు.. ఈ చిరు వ్యాపారి రైలు ఎలా ఎక్కుతున్నాడో చూడండి..

కూటి కోసం కోటి విద్యలు.. అన్న చందంగా కుటుంబ పోషణ కోసం కొందరు ప్రాణాలకు తెగించి మరీ పనులు చేస్తుంటారు. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా తెగించి మరీ పని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరు వ్యాపారి ప్రాణాలకు తెగించి రైలు ఎక్కడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైళ్లలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఎంతో చాకచక్యంగా రైలు ఎక్కడం, దిగడం చేస్తుంటారు. అలాగే ప్రయాణికుల మధ్యలో నుంచి ఎంతో ఓపిగ్గా అటూ, ఇటూ కదులుతూ ఆహార పదార్థాలను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరు వ్యాపారి రైలు ఎక్కే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..


ఫ్లాట్‌పామ్‌ పైకి వచ్చిన రైలు.. నిర్ణీత సమయం తర్వాత అక్కడి నుంచి బయలుదేరింది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు కాస్త ముందుకు చేరుకోగానే.. ఓ చిరు వ్యాపారి చేతులపై బుట్ట పట్టుకుని అక్కడికి వచ్చాడు. అయితే అప్పటికే రైలు ముందుకు వెళ్లడం చూసి.. ఎలాగైనా రైలు ఎక్కేయాలని పరుగుల తీశాడు. చేతిలో ఆహార పదార్థాల బుట్టను పట్టుకుని, మరో వైపు వేగంగా పరుగులు తీశాడు. చివరకు ఎలాగోలా రైలును క్యాచ్ చేసి మరీ లోపలికి ఎక్కేశాడు.

Viral Video: ఇది తెలివా.. లేక అతి తెలివా.. ఈ పాకీస్థానీయుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ క్రమంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఎట్టకేలకు అతను క్షేమంగా రైలు ఎక్కేయడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కూటి కోసం కోటి విద్యలు అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌‌లు, 35 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడతారా..! ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2025 | 08:49 PM