Viral Video: కరవడానికి వచ్చిన కుక్కతో కామెడీ చేయడమంటే ఇదే.. ఈ బైకర్ నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:20 PM
కొన్నిసార్లు కుక్కల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వాహనాలను వెంబడించి మరీ వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కొన్నిసార్లు కుక్కల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వాహనాలను వెంబడించి మరీ వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బైకర్‌ను వెంటపడిన కుక్క వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో ఓ కుక్క అతన్ని వెంబడించింది. అయితే సడన్‌గా వాహనం ఆపిన ఆ వ్యక్తి.. చివరకు ఏం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ వీధి కుక్క (dog chases biker) ఉన్నట్టుండి బైకును వెంటపడుతుంది. కుక్క వెంటపడడాన్ని చూసిన బైకర్.. కాస్త ముందుకు వెళ్లి సడన్‌గా వాహనాన్ని ఆపేశాడు. దీంతో కుక్క కూడా బైకు వద్దకు వచ్చింది.
Viral Video: పిల్ల ఏనుగును నిద్రలేపడం ఇంత కష్టమా.. తల్లి ఏనుగు ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
కుక్క అతడిని కరుస్తుందేమో అని అనుకునేలోగా సడన్‌గా సీన్ మారిపోయింది. దగ్గరికి వచ్చిన కుక్క తలపై చేయి వేసిన ఆ వ్యక్తి.. తర్వాత దాని మూతిని పట్టుకుని.. నోరు మూయడం, మూయడం చేశాడు. ఇలా పదే పదే చేయడం వల్ల కుక్క నోటి నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. ఈ శబ్ధాలు వినేందుకు చాలా ఫన్నీగా అనిపించాయి. ఇతను చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.
Viral Video: ఇందుకే ముంగీసను చూస్తే పాముకు భయం.. ఏం చేసిందో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కరవడానికి వచ్చిన కుక్కతో కామెడీ చేయడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదం.. కొన్నిసార్లు కుక్కలు ఊహించని విధంగా దాడి చేస్తాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..