Share News

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

ABN , Publish Date - Jan 08 , 2025 | 08:49 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో యువతులకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు యువతులు బహిరంగ ప్రదేశాల్లో వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాగే మరికొందరు బైకులు, కార్లలో వెళ్తూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Young woman Fell From Bicycle

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వీటిలో యువతులకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు యువతులు బహిరంగ ప్రదేశాల్లో వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాగే మరికొందరు బైకులు, కార్లలో వెళ్తూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యువతి సైకిల్‌పై వెళ్తుండగా వెనుక కారులో ఓ వ్యక్తి నిర్వాకానికి చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రాత్రి (young woman riding bicycle at night) వేళ్ల సైకిల్‌పై వెళ్తుంటుంది. అయితే చీకటి పడడంతో ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో అక్కడే ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లి.. కాసేపు కారు లైట్లు వేస్తే గ్రామంలోకి చేరుకుంటానని యజమానిని అభ్యర్థిస్తుంది. అతను కారు లైట్లు వేయగానే సదరు యువతి సైకిల్‌పై ముందుకు వెళ్తుంది.

Viral Video: గ్రామంలోకి చొరబడిన చిరుత.. సడన్‌గా తోక పట్టుకున్న వ్యక్తి.. చివరకు..


అయితే ఆమె కాస్త దూరం వెళ్లగానే లైట్లను ఆర్పేస్తాడు. దీంతో ఆమె రోడ్డు కనపడక ధబేల్‌మని (young woman fell from the bicycle) కిందపడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ అతను కారు లైట్లు వేస్తాడు. దీంతో ఆ యువతి మళ్లీ పైకి లేకి సైకిల్‌పై వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇంకాస్త దూరం వెళ్లగానే ఆ వ్యక్తి మళ్లీ కారు లైట్లను ఆర్పే్స్తాడు. దీంతో సదరు యువతి మళ్లీ ధబేల్‌మని కిందపడిపోతుంది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటుంది. సైకిల్‌ను కారుకు ఎదురుగా కిందపడేసి తిట్టుకుంటూ అక్కడి నుంచి నడుస్తూ వెళ్లిపోతుంది.

Viral Video: ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతికి షాకిచ్చిన కారు యజమాని’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఈమెకు పెద్ద కష్టమే వచ్చి పడిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 70 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్న బైక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2025 | 08:49 PM