Viral Video: సీటు కోసం మహిళల కుస్తీ.. మధ్యలోకి దూరిన టీసీ.. చివరకు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 09:45 PM
ఓ రైల్లో ఇద్దరు మహిళ మధ్య సీటు విషయంలో ఉన్నట్టుండి గొడవ మొదలైంది. ఇది కాస్త కాసేటిపటికి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో అంతా చూస్తుండగానే వారిద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. పక్కన ఉన్న వారు ఎంతగా సర్దిచెబుతున్నా వినిపించుకోకుండా కొట్టుకుంటున్నారు. వారి గొడవతో..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ప్రయాణికుల మధ్య పెద్ద యుద్ధాలే జరుగుతుంటాయి. కొందరు సీటు కోసం కుస్తీలు పడితే.. మరికొందరు ఏకంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటారు. ఇక మహిళల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీటు కోసం కొన్నిసార్లు వారి మధ్య పెద్ద పెద్ద గొడవలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో సీటు విషయంలో ఇద్దరు మహిళ మధ్య ఫైట్ జరిగింది. ఈ క్రమంలో వారి మధ్యలోకి టీసీ ఎంటరయ్యాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైల్లో ఇద్దరు మహిళ మధ్య సీటు విషయంలో (Women fighting for seat in the train) ఉన్నట్టుండి గొడవ మొదలైంది. ఇది కాస్త కాసేటిపటికి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో అంతా చూస్తుండగానే వారిద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. పక్కన ఉన్న వారు ఎంతగా సర్దిచెబుతున్నా వినిపించుకోకుండా కొట్టుకుంటున్నారు. వారి గొడవతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Viral Video: 13వ అంతస్తు నుంచి దూకేసిన వ్యక్తి.. వలలో నుంచి బయటికి వచ్చి మరీ.. చివరకు..
అయితే ఈ క్రమంలో అక్కడికి టీసీ (Railway TC) వచ్చాడు. మహిళలు గొడవ పడడం చూసి వారి వద్దకు వచ్చాడు. వారిని విడిపించాలని చూసినా మొదట సాధ్యం కాలేదు. దీంతో చివరకు టీసీకి కోపం కట్టలు తెంచుకుంది. గొడవపడుతున్న మహిళల మధ్యలోకి వెళ్లి, వారిని దూరంగా తోసేశాడు. మరోసారి గొడవ పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించాడు. ఇలా టీసీ కలుగజేసుకోవడంతో చివరకు గొడవ సర్దుమణిగింది.
కాగా, ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీటు కోసం పెద్ధ యుద్ధమే జరిగిందిగా’’.. అంటూ కొందరు, ‘‘వాళ్లను విడిపించకుండా వీడియోలు తీయడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కొంపముంచిన స్నేహితుడు.. వధువు ముందే వరుడి చెవిలో సీక్రెట్ చెప్పడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..