Share News

Marriage Viral Video: చచ్చినట్లు ఇవ్వాల్సిందే.. ఈ వరుడు బంధువులను భలే ఇరికించాడుగా..

ABN , Publish Date - Mar 15 , 2025 | 09:21 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ సాయంతోనే చేసే వెసులుబాటు వచ్చేసింది. ఏది కొనాలన్నా కూడా పర్సుతో పని లేకుండా ఫోన్ ఉంటే చాలు అనే రోజులివి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. తాజాగా వైరల్ అవుతున్న పెళ్లి వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Marriage Viral Video: చచ్చినట్లు ఇవ్వాల్సిందే.. ఈ వరుడు బంధువులను భలే ఇరికించాడుగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎన్నో పనులను స్మార్ట్ ఫోన్ సాయంతోనే చేసే వెసులుబాటు వచ్చేసింది. ఏది కొనాలన్నా కూడా పర్సుతో పని లేకుండా ఫోన్ ఉంటే చాలు అనే రోజులివి. నగదు బదిలీలు చాలావరకు తగ్గిపోయాయి. అంతా గూగుల్, ఫోన్ పేలతో చేసేస్తున్నారు. దీంతో పెద్ద వ్యాపారస్తులు మొదలుకొని, చిన్న చిన్న వ్యాపారుల వరకూ అంతా క్యూఆర్ కోడ్‌లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ వైరల్ అవుతోంది. వరుడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టెక్నాలజీని ఎలా వాడాలో ఈ వరుడికి బాగా తెలిసినట్లుందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వరుడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ప్రస్తుతం చాలా మంది జేబుల్లో క్యాష్ పెట్టుకోవడం తగ్గించి.. గూగుల్, ఫోన్ పే చేయడం అలవాటు చేసుకుంటున్నారు.

Viral Video: వీటినీ మడత పెట్టొచ్చు.. మూడు ఫోన్లను ఎలా సెట్ చేశాడో చూస్తే.. షాకవ్వాల్సిందే..


దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో గానీ.. ఓ వరుడు (Groom) తన పెళ్లికి వచ్చిన బంధువులంతా చచ్చినట్లు నగదు కానుక ఇచ్చేలా ఫోన్ (Phone) చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. వారి సాంప్రదాయం ప్రకారం వరుడికి బొట్టు పెట్టి, ఆశీర్వదించే బంధువులంతా అతడి చేతిలోని ఫోన్‌‌లో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నారు. ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్ (QR code) స్కాన్ చేసి, రూ.101లు డబ్బులను పంపించడం వీడియోలో చూడొచ్చు.

Viral Snake Video: కుర్చీలో కూర్చున్న పిల్లాడు.. పక్కనే పడుకున్న పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వరుడి ప్లానింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘టెక్నాలజీని వాడుకోవడమంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 42వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Couple Viral Video: అందరి మనసూ దోచుకున్నారుగా.. రైల్లో ఈ దంపతులు చేస్తున్న పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2025 | 09:21 PM