Share News

Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:12 PM

ఓ కోతి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. మధ్యలో కాలువ ఎదురవుతుంది. కాలువను చూడగానే ఆగిపోతుంది. ఎలాగైనా తడవకుండా దాటాలని అనుకుంటుంది. చివరకు కోతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి చేష్టలు చూస్తే కొన్నిసార్లు చిరాకు పుడితే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కోతి విచిత్ర నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాళ్లు తడవకుండా కాలువ దాటడానికి ప్రయత్నించిన కోతిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. మధ్యలో కాలువ ఎదురవుతుంది. కాలువను చూడగానే ఆగిపోతుంది. ఎలాగైనా తడవకుండా దాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలో చివరకు ఒంటి కాలిపై ఎగురుకుంటూ కాలువ దాటే ప్రయత్నం చేస్తుంది.

Komodo dragon Viral Video: గేదెపై కొమొడో డ్రాగన్ దాడి.. సమీపానికి వెళ్లగా షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


ఒంటి కాలిపైనే కాలువ మొత్తం అలా (Monkey crossing canal on one leg) కుంటుతూనే దాటేస్తుంది. ఇలా అతి తెలివితో కాలువ దాటేసిన కోతిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా కోతి అనగానే ఆహార పదార్థాలు లాక్కోవడం, చెట్ల కొమ్మలపై గెంతడం, వాహనాల్లోకి దూరి ఆహార పదార్థాలను దొంగతనం చేయడమే గుర్తుకు వస్తుంది. అయితే ఈ కోతి మాత్రం విచిత్రంగా కాలువ దాటడం చూసి అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్‌ మామూలుగా లేదుగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి విన్యాసాలు మూములగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతికి నీట్‌నెస్ అంటే ప్రాణం అనుకుంటా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌‌లు, 1.23 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Funny Video: ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమే.. ఎలా లాక్ చేశాడో చూస్తే..


వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Mar 16 , 2025 | 12:38 PM