Accident: బస్సును ఢీకొని బోల్తా పడిన ఆటో.. లోపల పరిశీలించగా దిమ్మతిరిగే సీన్..
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:43 AM
బస్సు, రైల్వేస్టేషన్లతో పాటూ విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్‌తో పాటూ అనేక రకాల జంతువులు కూడా పట్టుబడడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రమాదానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లగేజీతో వెళ్తున్న ఆటో.. ఆర్టీసీ బస్సును ఢీకొంది. చివరకు ఏం జరిగిందంటే..

రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరస్థులు నిషేధిత వస్తువులను పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా తరలించడం ఎక్కువైపోయింది. రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బస్సు, రైల్వేస్టేషన్లతో పాటూ విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్‌తో పాటూ అనేక రకాల జంతువులు కూడా పట్టుబడడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రమాదానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లగేజీతో వెళ్తున్న ఆటో.. ఆర్టీసీ బస్సును ఢీకొంది. అయితే చివరకు ఆటోలో పరిశీలించడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
వరంగల్ (Warangal) జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. చిలుకమ్మ నగర్ వైపు నుంచి నర్సంపేటకు వస్తున్న (Auto hits bus) ఆటో ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో బస్సు డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. చివరకు ఆటోలో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించంది.
ఆటోలో పరిశీలించగా కొండ గొర్రె, అడవి పంది మాంసం (Mountain goat and pork meat found in auto) బయటపడింది. డ్రైవర్, కండక్టర్ సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా.. పారిపోయిన వ్యక్తి ఖానాపురం మండలం అశోక్‌నగర్ వాస్తవ్యుడిగా గుర్తించారు. అలాగే చిలకమ్మ నగర్‌కు చెందిన సుమన్, చింటూ, సుధీర్, మొండ్రాయి గూడెంకు చెందిన లవకుమార్ కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు.
Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా..
మాంసం అక్రమ తరలింపు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు.. అనే కోణంలో కేసు విచారణ చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. పాకాల అభయారణ్యంలో మూగ జీవాల వేట యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Viral Funny Video: ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమే.. ఎలా లాక్ చేశాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..