Share News

Komodo dragon Viral Video: గేదెపై కొమొడో డ్రాగన్ దాడి.. సమీపానికి వెళ్లగా షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:19 AM

కొన్ని గేదెలు ఓ ప్రాంతంలో గడ్డి మేస్తుంటాయి. ఇంతలో ఓ కొమొడో డ్రాగన్ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ క్రమంలో గేదెలను చూడగానే వెంటనే దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Komodo dragon Viral Video: గేదెపై కొమొడో డ్రాగన్ దాడి.. సమీపానికి వెళ్లగా షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

కొమొడో డ్రాగన్ ఎంత శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద జంతువునైనా చూస్తుండగానే ప్రాణాలతో మింగేస్తుంటుంది. పంది, జింక వంటి జంతువులను చూస్తుండగానే మింగేసిన ఘటనలను చాలా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కొమొడో డ్రాగన్ గేదెలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని గేదెలు ఓ ప్రాంతంలో గడ్డి మేస్తుంటాయి. ఇంతలో ఓ కొమొడో డ్రాగన్ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ క్రమంలో గేదెలను చూడగానే వెంటనే దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. నేరుగా గేదె వద్దకు వెళ్లి దాడి చేయాలని చూస్తుంది.

Viral Funny Video: ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమే.. ఎలా లాక్ చేశాడో చూస్తే..


అయితే కొమొడో డ్రాగన్ ఇలా నోరు తెరవగానే గేదె వెంటనే అలెర్ట్ అవుతుంది. కొమొడోపై (Buffalo attack on Komodo dragon) ఎదురుదాడి చేస్తుంది. దెబ్బకు కొమొడో ఒక్కసారిగా వెనక్కు తగ్గుతుంది. కాసేపటి తర్వాత మళ్లీ గేదెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే గేదె తన కొమ్ములతో కొమొడోపై విరుచుకుపడుతుంది. దీంతో కొమొడో దూరంగా పారిపోతుంది. తర్వాత వాటిపైకి వెళ్లే సాయసం చేయదు. ఇలా గేదెలు కొమొడోకే చుక్కలు చూపిస్తాయి.

Viral Snake Video: కుర్చీలో కూర్చున్న పిల్లాడు.. పక్కనే పడుకున్న పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొమొడోకు చుక్కలు చూపించిన గేదె’’.. అంటూ కొందరు, ‘‘పిల్ల జోలికి వస్తే గేదె కూడా సింహం అవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 3.46 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్‌ మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 16 , 2025 | 10:21 AM