KTR: రేవంత్ తప్పిదాల వల్లే ఆర్థిక సంక్షోభం.. కేటీఆర్ ఫైర్
ABN , Publish Date - Mar 03 , 2025 | 09:31 AM
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పిదాలపై ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్‌లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని విమర్శలు చేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని కేటీఆర్ మండిపడ్డారు.
గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని అన్నారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగంలో ఈ విధ్వంసమని చెప్పారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభమని అన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా..అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై రఘురామ స్పందన..
జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News