Share News

Minister Jupalli: తప్పు చేయనప్పుడు కేటీఆర్ కోర్టుకెందుకు వెళ్లారు.. మంత్రి జూపల్లి ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:25 PM

Minister Jupalli Krishna Rao: కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ ప్రజలకు మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Minister Jupalli: తప్పు చేయనప్పుడు కేటీఆర్ కోర్టుకెందుకు వెళ్లారు.. మంత్రి జూపల్లి ప్రశ్నల వర్షం
Minister Jupalli Krishna Rao

కామారెడ్డి: మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేసు కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫార్ములా రేసు కేసును కేటీఆర్ ఫేస్ చేయాలన్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, హాజరు కావాలని చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని విమర్శించారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందని ఆక్షేపించారు.బాన్సువాడలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ(మంగళవారం) పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని తెలిపారు.


రూ.21 వేల కోట్లు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ తమ ప్రభుత్వం గురించి మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగిందని అన్నారు. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు పంచిపెట్టాలనే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్టానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్ఘాటించారు.

Updated Date - Jan 07 , 2025 | 01:28 PM