Telangana Government: మరో శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:16 PM
Telangana Government : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు తెలంగాణ సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
సిద్దిపేట: సంక్రాంతికి రైతు భరోసా ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలో విధివిధానాలను సబ్ కమిటీ ఫైనల్ చేస్తుందని అన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ(గురువారం) కోహెడ, కరీంనగర్‌లోని చిగురుమామిడిలో కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. సంక్రాంతికి రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో పార్టీ గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎవరి జోక్యం ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎవరి జోక్యం ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
సబ్‌కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చ..
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఈరోజు(గురువారం) రాష్ట్ర సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై కమిటి చర్చించింది. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే రైతు భరోసా విధివిధానాలపై చర్చ కొలిక్కిరాలేదు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎంత సీలింగ్ పెట్టాలి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఈనెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ నివేదిక ఉంచనుంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డితో సబ్ కమిటీ సమావేశమై విధివిధానాలు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
E Car Race Scam: ఈడి విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా..
CM Revanth Reddy: నేను మారాను.. మీరూ మారండి!
Rythubharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు
Read Latest Telangana News And Telugu news