Home » Rythu Runa Mafi
Rythu Bharosa: రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే! ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపర్చాలి! ఉదాహరణకు పదెకరాలున్న రైతు, ఏడెకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపర్చాలి!
Telangana Government : తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు తెలంగాణ సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనలు మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే ..
రైతు భరోసాపై బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడాన్ని తెలంగాణ శాసనసభ బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.