YSRCP: వైసీపీలో అరెస్టుల పర్వం..నెక్స్ట్ పేరు ఫిక్స్!
ABN, Publish Date - Feb 27 , 2025 | 07:41 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. యువగళం పాదయాత్రలో చట్టాన్ని మీరి ప్రవర్తించిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ఆస్తులు నష్టపరుస్తున్న వారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న నేతల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటానని నారా లోకేష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు. హద్దు మీరిన వైసీపీ నేతలకు చట్టప్రకారం శిక్ష ఉంటుందని లోకేష్ తెలిపారు.
మొదటగా నందిగామ సురేష్‌ను అరెస్ట్ చేశారు. అమరావతి రైతులపై సురేష్ అసభ్యంగా మాట్లాడటం, వారిని ఇబ్బందులకు గురిచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై నందిగామ సురేష్ దాడి చేసిన విషయం తెలిసిందే. హత్యానేరాల్లో కూడా సురేష్ పేరు వినిపించింది. సురేష్ తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వంశీ కృష్ణా జిల్లాలో ఎన్నో ఆరాచకాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు కుటుంబాన్ని, నారా భువనేశ్వరిపై వంశీ అసభ్యంగా మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు కూడా వంశీపై ఉంది. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేయడంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీని అరెస్ట్ చేశారు. వంశీ తర్వాత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ‌్‌కు సంబంధించిన మహిళ కుటుంబ సభ్యులపై, చంద్రబాబు నారా లోకేష్, భువనేశ్వరిలపై పోసాని కృష్ణమురళి అసభ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత వైసీపీ నేతలు పేర్నినాని, కొడాలి నాని, ఆర్కే రోజా తదితరులపై వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 27 , 2025 | 07:46 PM