Home » Andhra Pradesh » Ananthapuram
గ్రామాల్లో వలసల నివారణ కోసం 2006, ఫిబ్రవరి 2న దేశంలో నే ఎ్కడ లేని విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కరువు సీమలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చారు. నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ప్రధా ని మన్మోహన సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.
తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో నీరు లేక నిర్జీవంగా మారిన కుంటకు పీబీసీ ద్వారా నీరు ఇవ్వాలని ఆ గ్రామస్థులు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌ను కోరారు.
ఇంటింటి జియోట్యాగింగ్ ప్రగతిపై డీపీఓ నాగరాజ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీలో తనిఖీ చేశారు.
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఎస్పీ జగదీష్ దంపతులు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ కాన్ఫరెన్స రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల మధ్య ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు.
ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించే అహుడా సంస్థ అభివృద్ధిలో తమ అధినేత పవనకల్యాణ్ మార్క్ ఏంటో చూపుతామని అహుడా చైర్మన, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ అన్నారు.
మండలకేంద్రంలో బుధవా రం స్థానిక వాల్మీకుల ఆ ధ్వర్యంలోవాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠను ఘనం గా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.
ఉపాధ్యా యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌనిపాతిరెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు మోహనరెడ్డి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు నరేష్, ఇతర నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్లో కలిశారు.
త్వరలో జరగబోమే సాగునీటి సంఘం ఎన్నికల ఓటర్ల జాబితాపై మండలంలో గందరగోళం నెలకొంది. పాత జాబితానే అధికారులు ఉంచారని రైతులు ఆరోపిస్తు న్నారు. అయితే ఓటు నమోదుకు సమయం ఇచ్చి నా రైతులెవరూ రాలేదని అధికారులు అంటున్నా రు. దీంతో సాగు నీటి సంఘం ఓటర్ల జాబితాపై గందర గోళం పరిస్థితి ఏర్పడింది.
గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు...
మండలంలోని కుంటిమద్ది ఉన్నత పాఠశాల లో ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడంతో ఆ పాఠ శాల పీడీ అజయ్‌బాబును మంగళవారం సన్మానించారు.