Home » Andhra Pradesh » Ananthapuram
ఇటీవల డ్వామా పీడీ కార్యా లయంలో, పీడీ బంగ్లానుంచి అదృశ్యమైన వస్తువుల్లో కొన్ని వచ్చి చేరాయి. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో రెండు ఏసీలు, టీవీ, ఫర్నీచర్‌ను డ్వామా పీడీ బంగ్లాలోకి ఎవరో తెచ్చి పె ట్టారని ఆశాఖ వారే అంటున్నారు. అయితే మొత్తం డ్వామా పీడీ కార్యాల యం, బంగ్లాలో నుంచి ఇటీవల ఎనిమిది ఏసీలు, రూ.10లక్షలకు పైగా విలువ చేసే ఫర్నీచర్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు.
బడ్జెట్లో ఎస్సీల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటా యించినందుకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక హమాలీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం సీఎం చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని సోమవారం టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిం చారు. సోమవారం స్థానిక క్లాక్ టవర్ సమీ పంలోని మౌలానా విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, నాయకులు సైఫుద్దీన, ఫిరోజ్ అహ్మద్, తాజుద్దీన, సరిపూటి రమణ, కురబ నా రాయణస్వామి, మణికంఠ బాబు, ఓంకార్‌రెడ్డి, సరి పూటి శ్రీకాంత తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి ది ద్దామని ఉపన్యాసాలు హోరెత్తించింది. నాడు-నేడుతో విద్యార్థులకు అన్ని సౌకర్యాల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పింది. వైసీపీ ప్రభుత్వం నాటి మాటలు నీటి మూటలేనని అనడా నికి మండలంలోని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది.
కర్ణాటకలోని సండూరు నియోజకవర్గంలో శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కొం దరు వైసీపీ నాయకులు ప్రచారానికి దిగారు. డీ.హీరేహాళ్ మండల వైసీపీ కన్వీనర్ వన్నూరుస్వామి ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పట్టణంలోని బాలాజీ థిమేటర్ సమీపంలో ఉన్న మహాదేవ ఎరువుల దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షెట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారని, క్యాష్ బాక్సులో ఉన్న రూ.70వేల నగదును అపహరించారని బాధితుడు రాము తెలిపారు.
మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. అదే పాఠశాలలో 1980-81వ విద్యాసంవత్సరం లో పదో తరగతి చదివిన విద్యార్థులు సుమారు 43 ఏళ్ల తర్వాత అందరూ ఒక్కచోట కలుసుకున్నారు.
జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాకారులను ఎంపిక చేశారు. స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్‌స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి తైక్వాండో సబ్‌జూనియర్ క్రీడా కారుల ఎంపిక నిర్వహించారు. ఎంపికైన జట్టు వివరాలను తైక్వాండో జిల్లా అసోసియేషన ప్రధాన కార్యదర్శి గురుస్వామి తెలిపారు.
మండలపరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తు లు స్వామివారి దర్శనం కోసం తరలివ చ్చారు.
మండలంలో కాసుకో... పోలీస్... అంటూ దొంగలు సవాల్ విసురుతు న్నారు. తరచూ ఏదో ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడకుండా చోరీలు చేస్తున్నారు. ఇంటి తాళం వేశారా... ఆ ఇల్లు గుల్ల కావల్సిందే. దాదాపు ఐదు నెలల నుంచి జరిగిన చోరీలకు సంబంఽ దించి బంగారం, నగదు కలిపి రూ. కోటీ దాకా లూటీ అయి నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పొలాల్లోని పరికాలనూ దొంగలిస్తు న్నారు.