WARE HOUSE : నిరుపయోగంగా..!
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:24 AM
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర లభించని పరిస్థితుల్లో... కొంత కాలం పాటు భద్రపరచుకోవ డానికి, ప్రాథమిక వ్యవసాయ సహ కార సొసైటీలకు ఆదాయం రావాల న్న అలోచనతో గత వైసీసీ ప్రభు త్వంలో గిడ్డంగులు నిర్మించారు. భవ నాలు పూర్తి అయినా ఇంత వరకు వినియోగంలోకి రాలేదు.
వైసీపీ ప్రభుత్వంలో గిడ్డంగులు నిర్మించినా ప్రయోజనం శూన్యం
పంటలు నిల్వ చేసుకోలేక నష్టపోతున్న రైతులు
శింగనమల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర లభించని పరిస్థితుల్లో... కొంత కాలం పాటు భద్రపరచుకోవ డానికి, ప్రాథమిక వ్యవసాయ సహ కార సొసైటీలకు ఆదాయం రావాల న్న అలోచనతో గత వైసీసీ ప్రభు త్వంలో గిడ్డంగులు నిర్మించారు. భవ నాలు పూర్తి అయినా ఇంత వరకు వినియోగంలోకి రాలేదు. లక్షల రూపాయల నాబార్డు నిధులు వెచ్చించి నిర్మించినా రైతులకు అందుబాటులో కి రాలేదు. దీంతో పంటలను రోడ్డుపై ఆరబోసుకున్నా రు. అయితే వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్ట పో యారు. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన గిడ్డంగులతో తమకు ఎ లాంటి లాభం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాబార్డు నిధులతో శింగనమల మండలంలో రైతుల ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో వెస్టునరసాపురం, శింగనమలలో 500 మెట్రిక్ టన్నుల సామర్ద్యం కల్గిన రెండు గిడ్డంగులు నిర్మించారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో శింగ నమలలో 1000 మెట్రిక్ టన్నుల సా మర్ద్యంతో, ఈస్టు నరసాపురంలో రూ. 40 లక్ష లతో 500 ట న్నుల మెట్రిక్ సామ ర్థ్యంతో గిడ్డంగులు నిర్మించారు. తరిమె లలో రూ.60 లక్షల నిధులు వచ్చినా పనులు ప్రారం భం కాలేదు. శింగనమలలోని రెండు, ఈస్టునర సాపురం, వెస్టు నరసాపురంలోని గిడ్డంగులు పూర్తి అయినా క్షేత్రస్థాయిలో వినియోగానికి తీసుకురా వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపి స్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో వాటికి మోక్షం కల్పించి రైతులకు ఉ పయోగపడే చర్య లు తీసు కోవాలని రై తులు కోరుతు న్నారు.
అధికారులకు అప్పగించలేదు
మండలంలో నాలుగు గిడ్డంగులను నిర్మించినా నాబార్డు నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తి అయినా కొద్ది మేరకే బిల్లులు వచ్చాయి. మిగిలిన బిల్లులు వస్తే అప్పుడు గిడ్డంగులను అప్పగిస్తామని కాంట్రాక్టర్లు అధికారులకు తెగేసి చెప్పినట్లు సమాచారం.
రోడ్డుపైనే పంటలను ఆరబోసిన రైతులు
మండలంలో రైతులు సాగు చేసిన వరి, కంది, మొక్కజొన్న పంటలు గత 25 రోజులుగా కోత పడు తున్నాయి. అయితే ఓ వైపు గిట్టుబాటు ధర లేకపోవ డం, మరో వైపు వర్షం కారణంగా రైతులు కోసిన పంటను కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడు తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై ఆరబో స్తు న్నారు. అయితే వర్షాలకు తడిసిపోవడంతో రోడ్ల పైనే రాశులు పోసి, తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు నష్టాల్లో మునిగిపోయారు. అదే గిడ్డంగు లు అందుబాటులో ఉంటే పంటను అం దులో ఉంచి గిట్టుబాటు ధర వచ్చినప్పు డు అమ్ముకోనే వాళ్ల మని ,రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గిడ్డంగులు రైతులకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....