Home » Andhra Pradesh » Ananthapuram
ప్రతి ముసిం పవిత్ర ఖురానను పఠించి, అందులోని సా రాంశాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకో వాలని సయ్యద్ అమీర్ మసూది సాహెబ్ పేర్కొ న్నారు. జిల్లాకేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం తెహరీక్ ఫైజానే ఉమర్ ఫారుక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక సున్నీ ఇజ్తేమాకు ఉత్తర ప్రదేశకు చెందిన సయ్యద్ మసూది సాహెబ్ ముఖ్య అ తిథిగా హాజరై ఆధ్యాత్మిక బోధనలు చేశారు
ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్ట వద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్ర సాద్ సూచించారు. ఆయన ఆదివారం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. మార్కెట్లో సుంకం వసూలు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు.
పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సబ్సిడీపై మంజూరైన డ్రిప్, స్ర్పింక్లర్ పరికరాలను చెన్నేకొత్తపల్లిలో ఆదివారం రైతులకు ఆమె పంపిణీ చేశారు.
మండలంలోని జనార్దనపల్లి గ్రామానికి చెందిన దేవాలయ భూమిని వైపీసీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు అక్రమంగా రిజిస్ర్టేషన చేయించుకున్నారని మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.
చేతివృత్తుల వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అమలులో జాప్యం జరుగుతోంది. పథకం ద్వారా శిక్షణతోపాటు రుణ సదుపాయం పొందడానికి దరఖాస్తు చేసుకొని ఏడాది పూర్తయినా ఆర్థిక సాయం అందలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.
వ్యాపారులే టార్గెట్గా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు.
ప్రతి విద్యార్థి గణితం లో రాణించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన జయంతిని కళాశాల ప్రిన్సిపాల్ రఘురామమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.