Home » Andhra Pradesh » Ananthapuram
బాల్యవివాహాలు చట్టరీత్యానేరమని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. పట్టణంలోని నందలపాడులో ఉన్న మోడల్స్కూల్లో గురువారం కిశోరి వికాసం- బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు అని, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని మెచ్చిరి గ్రామంలో గురువారం తహసీల్దార్ నాగ రాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా కాలవ శ్రీనివాసులు పా ల్గొని మాట్లాడారు.
నూతనసంవత్సరంలో న్యాయంకోసం పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, పోలీస్ మార్కు కనిపించాలని ఎమ్మెల్యే పల్లె సిందూరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
మండలంలోని కునుకుంట్ల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్య క్తులు పాఠశాల ఆవరణ లో ఎనుముకు సంబంధించిన పుర్రె, కాళ్ల ఎముకలు ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ చల్లి క్షుద్రపూజలు నిర్వహించారు.
నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులకు సూచించారు.
అంధత్వం శరీరానికి మాత్రమేనని, మనస్సుకు కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. లూయిస్బ్రెయిలీ జయంతి సందర్భంగా జాతీయ అంధుల క్రీడా సమాఖ్య ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణకళామందిరంలో అంధుల క్రీడా పోటీలు నిర్వ హించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎంఎస్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై లూయీస్ బ్రెయిలీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
గత 30 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో గురువారం పార్టీ సీనియర్ నాయకులు గుడిపూటి రాఘవేంద్ర చౌదరి, పాలడుగు చంద్ర శేఖర్ నాయుడు రూ.లక్ష చొప్పున చెల్లించి ఎమ్మెల్యే చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు.
కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్కు సూచించారు.
మండలంలోని బండ్లపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుతతీగలను ఏ ర్పాటు చేశారు. వాటిని రోడ్డుమీదే అడ్డంగా తీసుకెళ్లడంతో.. ఏ మాత్రం ఆదమరిచినా వారు ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఈ దారి పక్క నే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుం టు న్నారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో సచివాలయం, హెల్త్ సెం టర్ ఉన్నాయి.
మెులకలచెరువులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెులకలచెరువు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.