MLA : అధ్వానంగా మారిన రోడ్లకు మోక్షం
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:12 AM
కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, జనవరి 2(ఆఽంఽధ్రజ్యోతి): కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్ గ్రామాల అభివృద్దికి తొలిప్రాధాన్యం ఇస్తున్నార న్నారు. అలాగే కనగానపల్లి మం డలం నరసంపల్లి వ్యవసాయక్షేత్రంలో ఆమె చీనీ, కొబ్బరిపంటలను పరిశీలించి దిగు బడి బాగా రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, రా మ్మూర్తినాయుడు, మండల కన్వీనర్ సుధాకర్, శ్రీధర్‌నాయుడు , ఎసీసెల్ సుబ్బరాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసులు, పోతన్న, వెంకటరాముడు, రమణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....