AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:14 PM
మెులకలచెరువులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెులకలచెరువు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.
అన్నమయ్య జిల్లా: మెులకలచెరువు (Molakalacheru)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెులకలచెరువు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ (TDP vs YSRCP)గా మాటల యుద్ధం చోటు చేసుకుంది. జనవరి 2న ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో హరినారాయణ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు ఇవాళ ఉదయం ఎంపీడీవో కార్యాలయం వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సభ్యులు అక్రమంగా గెలిచారని టీడీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలా గెలిచిన వైసీపీ సభ్యులు సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో తమపై పెత్తనం చేయాలని వైసీపీ సభ్యులు చూస్తున్నారని టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. అక్రమ పద్ధతుల్లో గెలిచి సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెులకలచెరువు మండల సర్వసభ్య సమావేశాలు ఆరు నెలలుగా జరగడం లేదు. దీంతో స్థానికంగా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. అయితే సమావేశాలు నిర్వహించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని మండల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వచ్చిన వైసీపీ సభ్యులు, పార్టీ శ్రేణులు.. టీడీపీ నేతలను రెచ్చగొటేలా వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ పరిస్థితి మెుదటికి వచ్చింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలూ పెద్దఎత్తున చేరుకోవడంతో పరిస్థితి చేయి దాటే స్థితికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలనూ నిలువరించే ప్రయత్నం చేశారు. భారీకేడ్లను ఏర్పాటు చేసి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు భారీగా ఉండడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం సవాల్‌గా మారింది. మరోవైపు సమయం ముగిసిపోవడంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!
Read Latest AP News And Telugu News