Electric wires : నిండా నిర్లక్ష్యం..!
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:08 AM
మండలంలోని బండ్లపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుతతీగలను ఏ ర్పాటు చేశారు. వాటిని రోడ్డుమీదే అడ్డంగా తీసుకెళ్లడంతో.. ఏ మాత్రం ఆదమరిచినా వారు ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఈ దారి పక్క నే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుం టు న్నారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో సచివాలయం, హెల్త్ సెం టర్ ఉన్నాయి.
వందల మంది తిరిగే రోడ్డుపై విద్యుత తీగలు
ఆదమర్శిస్తే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే
నార్పల, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని బండ్లపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుతతీగలను ఏ ర్పాటు చేశారు. వాటిని రోడ్డుమీదే అడ్డంగా తీసుకెళ్లడంతో.. ఏ మాత్రం ఆదమరిచినా వారు ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఈ దారి పక్క నే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుం టు న్నారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో సచివాలయం, హెల్త్ సెం టర్ ఉన్నాయి. గ్రామస్థులు అదే దారి గుండానే వెళ్లాల్సి ఉంది. పంచా యతీ అధికారులు తాగునీటి కోసం ఈ విద్యుత తీగలను ట్రాన్సఫార్మర్‌కు అమర్చి రోడ్డుపైన పరిచినట్లు తెలిసింది. అయితే విద్యుత స్తంభాలు కా వాలని అనేక సార్లు విద్యుత అధికారులను కోరినా పట్టించుకోవడం లే దని గ్రామస్థులు తెలిపారు. దాదాపు ఆర్నెల్లుగా ఈ రోడ్డుపైనే విద్యుత తీగలు ఉండడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన ఆ విద్యుత తీగలపై నడవడానికి భయాందోళనకు గురవు తున్నామని వాపోతున్నారు. పాఠశాల పక్కనే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తుంటారని, పొరపాటున ఆ విద్యుత తీగలను పట్టుకుంటే ఏ క్షణం ఏమి జరుగుతుందోననే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి విద్యుత, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డుపై వి ద్యుత తీగలను ఏర్పాటుచేయడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నా యి. ఇప్పటికైనా సంబంధింత అధికా రులు చొరవ తీసుకుని రోడ్డుపై వెళుతున్న విద్యుత తీగలు తొలగిం చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....