Home » Andhra Pradesh » Chittoor
స్విమ్స్ యునివర్సిటీలో బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సె్స(పారా మెడికల్) కోర్సులకు 4వ విడత, ఫైనల్ ఆఫ్లైన్ విధానంతో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ర్టారు అపర్ణ బిట్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రబీ సీజన్లో సాగుచేసే పంటలకు రైతులే బీమా కట్టుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్రావు శుక్రవారం తెలిపారు.
రోడ్డుకు ఒక వైపు 16 ఏనుగుల ఘీంకారాలు. మరో వైపు వీటిని చూసేందుకు గుమిగూడిన జనం.
రుణం తీసుకుని రెండేళ్ళు కావస్తున్నా అక్కడ పరిశ్రమ స్థాపించలేదు. సకాలంలో రుణ కంతులనూ చెల్లించలేదు. దీనిపై బ్యాంకు అధికారులు ఆరా తీశారు. మరోవైపు బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమి పత్రాలను పరిశీలించారు. వాళ్లు ఒకవేళ రుణం చెల్లించకుంటే తనఖా పెట్టిన భూమినైనా వేలం వేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించారు. ఆ మేరకు డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్ళి పరిశీలించగా అవి నకిలీవని తేలింది.
తిరుపతి రుయాస్పత్రి నో ఫ్లెక్సీ జోన్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ పథకాల బోర్డులు తప్ప, ఇతర ఫ్లెక్సీలు, బోర్డులు పెడితే రుయా అధికారులపై చర్యలు తప్పవు’ అని కలెక్టరు వెంకటేశ్వర్ హెచ్చరించినట్లు తెలిసింది.
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. అనారోగ్యంతో బాధపడే భక్తులు క్రమం తప్పకుండా వెంట మందులు తీసుకువెళ్లాలని నిర్దేశించింది. కొండపై వైద్య సదుపాయాలు అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలిపింది.
Andhrapradesh: తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి మరీ శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను కూడా ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఒకేసారి 16 ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటపొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఐదేళ్ల కొడుకు సహా తండ్రి మృతి చెందగా తల్లి చికిత్స పొందుతోంది. ఈ ఘటన బుధవారం రాత్రి శ్రీకాళహస్తి మండలం దొమ్మరపాళెం వద్ద కాసరం రహదారిపై జరిగింది.
రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్ డిస్టిలరీ్సలో సీఐడీ అధికారుల బృందం మంగళవారం చేపట్టిన తనిఖీలు బుధవారం ముగిశాయి.