Bhuvaneshwari: నాలుగురోజుల పాటు కుప్పంలో భువనేశ్వరి పర్యటన
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:37 AM
Andhrapradesh: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు.
చిత్తూరు, డిసెంబర్ 19: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం చేరుకున్న భువనమ్మకు పీఎస్ మెడికల్ కాలేజ్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో జరుగుతున్న సొంత ఇళ్లు నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించారు.
AP News: గుంటూరులో వైసీపీ కీలక నేతపై కేసు
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. ప్రతీ మండలంలో భువనేశ్వరి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈరోజు ఉదయం తాను బస చేసిన కుప్పం పీఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలను భువనమ్మ స్వీకరించారు. అనంతరం శాంతిపురంలోని కడపల్లిలో సొంత ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న సీఎం సతీమణి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈరోజు సాయంత్రం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ప్రతీ మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ఆపై సమస్యల పరిష్కారానికి భువనమ్మ తగు చర్యలు తీసుకోనున్నారు. ఈరోజు నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. ఆదివారం మధ్యాహ్నం పర్యటనను ముగించుకుని తిరిగి అమరావతికి భువనేశ్వరి చేరుకోనున్నారు. కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాటు చేశారు.
Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబుతో కలిసి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు. కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామానికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే చర్యల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు
వాహనదారులకు షాక్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
Read Latest AP News And Telugu News