Home » Andhra Pradesh » Chittoor
పూడికతీతకు 97 కోట్లు కేటాయింపు
చిత్తూరు, తిరుపతి జిల్లాకు బడ్జెట్లో గణనీయంగా నిధుల కేటాయింపు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఇక కదలిక
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.
నకిలీ నోట్లు ఎలా ముద్రించాలి?’ అనేది యూట్యూబ్‌లో చూశారు. ఆ ప్రకారం వస్తువులు తీసుకొచ్చి ముద్రణ చేపట్టారు. వీటిని చెలామణి చేసే క్రమంలో పట్టుబడ్డారు.
ఆ చిన్నారికి ఏం కష్టమొచ్చిందో పాపం.. డార్మిటరీలోని ఐటర్కాట్కు టవల్‌ను బిగించి ఉరేసుకుని చనిపోయాడు. అంతవరకు తమతో పాటే వంట పనుల్లో సాయం చేసిన ఆ చిన్నారి.. విగతజీవిగా మారిపోవడంతో సహచర విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్యారంపల్లెలో గురుకులంలో 5వ తరగతి చదువుతున్న తిరుపతి జిల్లాకు చెందిన రెడ్డిమోక్షిత్ మృతి కలకలం రేపింది.
ఇంతకాలం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన డాకర్ దుగ్గిరాల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
ఆన్లైన్ బెట్టింగ్‌కు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భరించలేక ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు.
పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దేవళంపేటలో 75 కొబ్బరి, 17 మామిడిచెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేయడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు.