Share News

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:20 PM

Andhrapradesh: చిత్తూరు జడ్పీ సమావశం రచ్చరచ్చగా మారింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మండల సర్వసభ్య సమావేశాలను జరగనీయకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తరహాలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.

AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ
Chittoor ZP meeting

చిత్తూరు, డిసెంబర్ 31: చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో (Chittoor ZP meeting) రసాభాసగా మారింది. కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. టీడీపీ (TDP) సభ్యులపై పరుష పదజాలంతో వైసీపీ (YSRCP) సభ్యులు దూసుకెళ్లారు. నిధుల పంపిణీ పనుల కేటాయింపులు వైసీపీ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సమావేశంలో ఆ పార్టీ సభ్యులు వాదనకు దిగారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మండల సర్వసభ్య సమావేశాలను జరగనీయకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కోర్టు కు వెళ్లి అనుమతులు తెచ్చుకుని సమావేశాలు నిర్వహించాలనుకున్న కత్తులు, కర్రలతో సమావేశంలో జరగనీకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆరోపించారు.


వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తరహాలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. పుంగనూరుకు చంద్రబాబును రానీయకుండా అడ్డుకున్న సంస్కృతి వైసీపీది కాదా అంటూ టీడీపీ సభ్యుల ఎదురుదాడితో వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిబంధనల ప్రకారమే అభివృద్ధి జరిగిందా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమేనా అంటూ టీడీపీ సభ్యులు సవాల్ విసిరారు.

పెన్షన్ ఇచ్చాక.. చంద్రబాబు ఏం చేశారంటే


టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం...

మరోవైపు బాపట్లలోని చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. డ్రైనేజీ మురుగు కాల్వ పూడికలు సరిగ్గా తీయడం లేదంటూ వైసీపీ కౌన్సిలర్ రాములు చైర్మన్‌ శ్రీనివాసరావుకు వినతి చేశారు. ఎమ్మెల్యే కొండయ్య సారధ్యంలో డ్రైనేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని టీడీపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. ఈ అంశంపై కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుందకుంది. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను చైర్మన్ శ్రీనివాసరావు అర్ధాంతరంగా వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి...

ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..

బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 02:29 PM