Suspension: అగ్రికల్చర్ కాలేజీ ప్రొఫెసర్ ఉమామహేష్ సస్పెన్షన్
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:53 AM
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయన్ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, రిమాండు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఉద్యోగ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఉమా మహే్‌షను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.