Home » Andhra Pradesh » Elections
మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ 3.O ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ కీ రోల్ పోషించనున్నాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) నేడు(గురువారం) ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు.
ఎన్డీఏ కూటమిలో మంత్రివర్గంలో స్థానంపై భీమిలీ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.
అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ (Satyakumar) పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైఎస్సార్సీపీ (YSRCP) కకావికలం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.
ఏపీలో ప్రభుత్వం మారడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని సిబ్బందిని మాతృ శాఖలకు జీఏడీ పంపించారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్సులను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ప్రభుత్వం మారడంతో పలువురు అధికారులు రిలీవ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయింది.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈరోజు రాత్రికి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు(శుక్రవారం) ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అవకాశం ఉంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్ట సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌ను (Akira Nandan) మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.