Home » Andhra Pradesh » Guntur
ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామంటూ నేతలు పదవులు కావాలని అడగడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.
రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే రూ. 21 వేల కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు.
ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
Andhrapradesh: రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతి ఏ5 గా ఉన్నారు.
ఒక్కొ రైతుకీ రూ.20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారని, ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్సే లేకుండా పోయిందని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి అవంతీ శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇదేకోవలో మరో నేత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. అయితే గూగుల్ ప్రకటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10వేలమందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని వ్యాఖ్యానించారు.
కలెక్టర్లు, ఎస్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజు సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.