Share News

YSRCP: వైసీపీకి మరో భారీ షాక్.. రాజీనామా యోచనలో కీలక నేత

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:50 AM

వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి అవంతీ శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇదేకోవలో మరో నేత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

 YSRCP: వైసీపీకి మరో భారీ షాక్.. రాజీనామా యోచనలో కీలక నేత

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి కీలక నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడగా.. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అవంతీ శ్రీనివాస్ ఊహించని రీతిలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.


ఇలా ఉండగానే మరో కీలక పరిణామం వైసీపీని భారీగా కుదిపేసింది. ఇదేకోవలో మరో నేత వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. జగన్ పార్టీకి రాజీనామా చేసేందుకు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు గ్రంధి శ్రీనివాస్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మరికొన్ని రాజీనామాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.

Grandhi-Srinivas.jpg


వైసీపీ దుకాణం బందేనా..?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కీలక నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.

Updated Date - Dec 12 , 2024 | 12:10 PM