Minister Mandipalli: ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:34 AM
ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. అయితే గూగుల్ ప్రకటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10వేలమందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని వ్యాఖ్యానించారు.

అమరావతి: గూగుల్ ఒప్పందం రాష్ట్రానికి శుభ పరిణామం, ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి నాంది అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన కృషితో గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి వస్తోందని తెలిపారు. ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు వేయబోతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10వేలమందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. విశాఖపట్నంలో గూగుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జీజీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వికాశ్ కోలే బృందం సమావేశమైంది. చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. పెట్టుబడులు ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నారు, విశాఖ సహా రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ఎక్కడెక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వికాస్ వెల్లడించారు. ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ చేసుకున్న ఒప్పందం, ఆ తర్వాత విశాఖలో వికాస్ పర్యటన గురించి చర్చ జరిగింది.
అమెరికా పర్యటనలో గూగుల్‌ను మంత్రి లోకేశ్ సందర్శించడం, రాష్ట్రానికి ఏఐ సేవలు అందించాలంటూ ఆహ్వానించడం వంటి అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని వికాస్ వెల్లడించారు. మంత్రి లోకేశ్, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌తో జరిపిన సంప్రదింపుల తర్వాత రాష్ట్రంతో వ్యూహాత్మకంగా కలసి ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో గూగుల్ కార్యకలాపాలను చేపట్టడం, అందునా విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. రిలయన్స్, నిప్పాన్ స్టీల్స్, భారత్ ఫోర్బ్స్, టాటా గ్రూప్ వంటి సంస్థలు రాష్ట్రానికి రావడంపై చర్చ సాగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu: కలెక్టర్లు అలా చేస్తే మంచిది కాదు... సీఎం చంద్రబాబు సీరియస్
YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..
Read Latest AP News And Telugu News