Home » Andhra Pradesh » Guntur
అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లోశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మూడేళ్లలో రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. తమకు మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు.
కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలను, మెట్రో నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.
Andhrapradesh: గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. జగన్ జులం ప్రదర్శించాలని చూస్తూ కుదరదు అంటూ ఆలపాటి రాజా వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
Andhrapradesh: ఏపీలో లా అండ్ ఆర్డర్‌పై వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే తమ హయాంలో మహిళ కోసం తీసుకువచ్చిన పథకాలపై మాట్లాడారు. ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఎత్తేసిందని మండిపడ్డారు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.
పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె ఈ ఏడాది మార్చిలో మహిళ కమిషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా ఆమె వాయిస్ వినిపించడంలేదు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోనూ, అంతకుముందు వైసీపీ తరపున..
చిరుతల అనుమానాస్పద మరణాలపై పకడ్బందీగా విచారణ చేసి నేరస్తులను గుర్తించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని వన్యప్రాణుల వేట ఘటనలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వన్న్య ప్రాణులను వేటాడటం, వాటి అవయవాలతో వ్యాపారాలు చేసేవారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సుహాన జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈరోజు రాత్రి మృతిచెందింది. బ్రెయిన్ డెడ్ కావటంతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరింది. రౌడీ షీటర్ నవీన్ దాడి చేయడంతో బ్రెయిన్ డెడ్ అయింది. రేపు జీజీహెచ్‌లో సుహానా కుటుంబ సభ్యులను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు.
వంగవీటి రాధా ఇంటికి మంత్రి నారా లోకేష్ ఈరోజు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.