Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు జలశక్తి అవార్డులు వచ్చాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవార్డులను స్వీకరించారు.
వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు గాడి తప్పాయని వాటిని గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.
యువగళం పాదయాత్రలో సర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెటాతో ఎంవోయూ చేసుకున్నారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి..
ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ 2024 మంగళవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.
ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు.
ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ అధికారులతో ఈరోజు లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం దీపం పథకం ప్రవేశ పెట్టబోతుంది. దీపావళి రోజున ఆ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
అధికారం కోల్పోయిన తర్వాత.. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ ఎంతో మంది సొంత పార్టీ నాయకులే హితవు పలికారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహారించాలని, సోదరి షర్మిలతో వివాదం మంచిదికాదని.. ఎన్నికలకు ముందు జగన్కు సన్నిహితులు చెప్పినా.. ఆయన మాత్రం ససేమిరా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత..
గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్లో కేసు నమోదైంది.