Share News

YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే

ABN , Publish Date - Dec 07 , 2024 | 08:25 AM

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. వైసీపీ నేతలను గుడివాడలో వరుస అరెస్ట్‌లు చేస్తున్నారు.

YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే

కృష్ణాజిల్లా (గుడివాడ): వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. సీన్ కట్ చేస్తే.. ఐదంటే ఐదేళ్లలో టీడీపీ కూటమి (NDA Alliance) అధికారంలోకి రావడంతో నాడు ఓవరాక్షన్ చేసి విర్రవీగిన ఒక్కొక్కరి తాట తీస్తున్నారు పోలీసులు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది..! ఒక్కొ ఘటన గుర్తుకు తెచ్చుకుని మరీ.. పాత విషయాలన్నీ బయటకు తీసి వైసీపీ నేతలకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు.


వరుస అరెస్టులు..

ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయటకు తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది.. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టార్గెట్‌గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొడాలి నాని అనుచరులపై చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నాయకుల అరెస్టులు గుడివాడలో కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో ఇప్పటికే 12 మంది వైసీపీ నాయకుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అరవపేటకు చెందిన కొండూరి రాజారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఏం జరిగింది..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు.. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా.. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనరాదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారు. ఆఖరికి.. డిసెంబర్-25, 2022లో టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా ‘మాకేమీ పట్టదు’ అన్నట్లుగా పూర్తిగా వైసీపీ నేతలకే కొంతమంది పోలీసులు కొమ్ముకాశారనే ఆరోపణలు ఉన్నాయి.


విర్రవీగిన వైసీపీ నేతలు

నాడు వైసీపీ అధికారంలో ఉండగా మా వంతు అని విర్రవీగారు. గన్నవరంలో దాడి తాలుకూ వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌లతో పాటు మరో ఇరవై మందిపై 143,144,146,188,427,506 R/W 149 BNS కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు.. కే కన్వెన్షన్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైనా పోలీసులు విచారణ చేపట్టారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. కొడాలి నాని టార్గెట్‌గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజా రెండు కేసులతో బెజవాడ వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Lokesh :మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌కు 50 రోజులు

AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?

CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్‌’ కథ కంచికి!?

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 08:34 AM