Home » Andhra Pradesh » Krishna
వాంబేకాల నీలో ఆదివారం తెల్లవారుజా మున తెలుగుయువత సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడు కంచి ధనశేఖర్కు చెందిన కారు అగ్నికి ఆహుతి అయింది.
నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలం కింద రెండు సెంట్లు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచ దార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు.
నడకతో కలిగే ప్రయోజ నాలపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు విజయవాడ రన్నర్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన మారథాన్ ఉత్సాహంగా సాగింది.
మంత్రిశక్తి పూర్తిగా వైజ్ఞానికమని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హైసూల్స్ కమిటీ, దుర్గామల్లేశ్వర దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమాలను రెండు రోజులపాటు నిర్వహించారు.
ప్రజాపిత బ్రహ్మకుమారి యోగమార్గం అనుసరించడం ద్వారా శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయని వరంగల్, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల రీజనల్ ఇన్ఛార్జి రాజయోగిని బ్రహ్మకుమారి సవిత అన్నారు.
దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన షాపు లీజు పూర్తికావడంతో ఖాళీ చేయమన్నందుకు అద్దెదారుడు కోర్టుకు వెళ్లాడు. దేవస్థానానికి చెల్లించాల్సిన అద్దె కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు.
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం కావటంతో దుర్గా మల్లేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రధానం అయిందని, కానీ పిల్లల్లో మానసిక వికాశం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరగాలంటే వారిని క్రీడలు, సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాలని శాశనమండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు సూచించారు.
విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్ మెయిల్ చేస్తానని, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, జగన్రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.
పూనూరు గౌతంరెడ్డి.. అందరికీ తెలిసి ఆయన వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. న్యాయవాది కూడా అయినా.. ఎవరికీ తెలియని క్రిమినల్ ఆలోచనలు చేయడంలో ఆయన దిట్ట. ఆది నుంచి నేరస్వభావం కలిగిన గౌతంరెడ్డి సత్యనారాయణపురంలోని గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్న పన్నాగంలో ఎన్నో క్రిమినల్ స్కెచ్లు వేశాడు. పోలీసులు తన జోలికి వెళ్లకుండా న్యాయవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.