Home » Andhra Pradesh » Kurnool
ప్రణాళికాబద్ధంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
వచ్చే నెల 14వ తేదిన జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
జిల్లా కనొయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని చిన్న చెరువులో రాష్ట్ర స్థాయి పడవ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.
పట్టణానికి చెందిన ఓ యువనాయకుడి బియ్యం దందా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పేదలకందే బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కాపు దశలో ఉన్న కంది పంటను గూడు, పచ్చ పురుగు ఆశించాయి. ఈ పురుగులు పంటను నమిలేస్తుండటంతో పూత, కాయలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియా పేటలో పార్వతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు నాగరాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. తాగుడుకు బానిసయ్యాడు.
వైసీపీ నాయకులవి స్వార్థ రాజకీయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
కర్నూలు నుంచి జిల్లా నుంచి న్యాయ సంస్థల తరలింపును వైసీపీ వ్యతిరేకిస్తోందని కర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు
వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్ అక్రమాలు కారణంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న తుంగభద్ర ప్రాజెక్టు (టీబీపీ) బోర్డు అకౌంట్ ఫ్రీజ్ చేసే పరిస్థితికి వెళ్లింది.
మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబుహెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా ఆదోని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు