Home » Andhra Pradesh » Prakasam
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి, అక్రమాలపై ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇందుకోసం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ బుధ వారం సాయంత్రం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది.
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్న 108 వాహనాలు మూగబోతున్నాయి. నిత్యం ఎక్కడ ఏప్రమాదం జరిగినా సత్వరమే చేరుకునే వాటికి ఇంధనం (డీజిల్) లేని పరిస్థితి నెలకొంది. ఆ వాహనాలకు అవసరమైన మేరకు డీజిల్ లేకపోవడంతో ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయోనని పైలెట్లు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలపై అఽధికారులు లెక్క తేల్చారు. వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం ఆరు రకాల పంటలు 5,020.96 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, 7,468మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించారు.
సంతనూతలపాడులోని మద్దులూరు రోడ్డులో ఉన్న నాగరాజ ట్రేడర్స్ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 3వేల రేషన్ బియ్యం బస్తాలను ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆ దిలక్ష్మి బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సచివాలయంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో విచ్చలవిడిగా గ్రామాలలో ప్రభుత్వ భవనాలకు రూ.కోట్ల నిధులను మంజూరు చేశారు. కానీ ఎక్కడా నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. పలు గ్రామాలలో ఏళ్ల తరబడి అలానే అసంపూర్తి పనులతో ప్రభుత్వ భవనాలు నిర్మాణం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రజా నిధులు పెద్ద ఎత్తున వృథా అవుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దర్శి-పొదిలిరోడ్డులోని కాటేరువాగుపై నిర్మించిన చప్ట్టాకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు కూలి ప్రమాదభరితంగా మారింది.
దేవస్థాన ఆస్తుల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించి చేయూత ఇవ్వాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. పామూరు నడిబొడ్డున ఉన్న శ్రీవల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 11 సెంట్ల స్థలంలో నిర్మించిన దుకాణాలకు సక్రమంగా అద్దెలు చెల్లించకుండా ఇబ్బందులు పె డుతుండటంతో గత నెల 24న ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆ షాపులను సీజ్ చేశారు.
మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా నిర్మాణ సామగ్రిని కాలేజీ ప్రాంతం నుంచి తరలించేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక ఆ సంస్థ నిర్మాణాన్ని వదిలేసినట్లే అన్న చర్చ స్థానికంగా నడుస్తోంది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అక్రమాలపై ఏకంగా సెక్షన్ 51 విచారణ వేసే వైపు ఉన్నతస్థాయిలో అడుగులు పడుతున్నాయి.