Home » Andhra Pradesh » Visakhapatnam
ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నా నగర ట్రాఫిక్ పోలీసుల తీరు మారడం లేదు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనధికార లేఅవుట్లు లెక్కకు మించి వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో వ్యాపారులు వ్యవసాయ భూములు కొని లేఅవుట్లుగా మారుస్తున్నారు.
బలిఘట్టం ఉత్తర వాహిని సమీపంలోని సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం దత్తత తీసుకున్నట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాంప్ ఆఫీసు నుంచి అధికారంగా తెలిసింది. దీనికి సంబంధించిన దేవదాయ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది. వివరాల్లోకి వెళితే.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా ‘సౌర శక్తి’ వెలుగులు ప్రకాశించనున్నాయి. ఇంటి పైకప్పుపై కనీసం 100 చదరపు అడుగుల స్థలంలో ఒక కిలోవాట్ సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి యూనిట్‌ను అమర్చుకోవచ్చు. సౌర విద్యుత్ ప్యానల్స్, ఇతర సామగ్రి విలువపై ఒకటి, రెండు కిలోవాట్లు అయితే 60 శాతం, మూడు కిలోవాట్లకు మించితే 40 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తున్నది. లబ్ధిదారులు తమ వాటా సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా పొందే వెసులుబాటు కూడా వుంది.
గంజాయి కేసులో ఐదుగురుముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎ.రత్నకుమార్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన జాజిమొగ్గల సంతోష్, వడ్డాది రమణ, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లికి చెందిన సీదరి సుబ్బారావు, చింతాడ లక్ష్మయ్య, కొర్రా బాబూరావులు 2015 ఫిబ్రవరి 16వ తేదీన 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ చీడికాడ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో వీరిపై ఎస్ఐ విశ్వనాఽథం కేసు నమోదు చేశారు.
‘సదరం’ వెబ్సైట్లో స్లాట్ల కేటాయింపు సక్రమంగా లేదనే వాదన వినిపిస్తోంది.
జాతీయ రహదారిపై తగరపువలస వద్ద గల గోస్తనీ వంతెన పైనుంచి గురువారం రాత్రి ఒక కారు కింద ఉన్న నదిలో పడిపోయింది.
జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది.
నగరంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
మునిసిపాలిటీలో దశాబ్దాల క్రితం నిర్మించిన పలు తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో పలు ట్యాంకుల నాణ్యత, సామర్థ్యాన్ని పరీక్షించిన అధికారులు.. కొన్ని ట్యాంకులు వినియోగించడానికి వీలుకాని పరిస్థితిలో వున్నాయని ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ కొత్త ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన ట్యాంకులనే వినియోగిస్తున్నారు.