Home » International
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెల 28న తన ప్రేయసి లారెన్ శాంచెజ్‌ను పెళ్లిచేసుకోబోతున్నారు.
దక్షిణాఫ్రికాలోని కాంగోలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి.. 38 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.
వేగంగా ప్రయాణిస్తున్న బస్సు టైరు ఊడిపోయింది. దీంతో ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. కజాన్ నగరంలోని నివాస భవనాలే లక్ష్యంగా దాడులు జరిపింది.
జర్మనీలో ఓ సైకియాట్రిస్ట్ సైకోగా మారాడు. క్రిస్మస్ సందర్భంగా మగ్డేబర్గ్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న పౌరులపైకి విచక్షణారహితంగా.. అతి వేగంతో కారుతో దూసుకెళ్లాడు.
రెండ్రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన 'హలా మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌లోని గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను శనివారంనాడు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు.
సుమారు 8 డ్రోన్లు కజన్‌లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది.
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై కేసు నమోదు వెనుక ఉన్న అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ జనవరి 10న తన పదవికి రాజీనామా చేయనున్నారు.
తమ దేశానికి వలసల సంఖ్యను పెంచడానికి కెనడా సిద్ధమైంది. ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (పీఎన్పీ) కింద విదేశీ పౌరులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ట్రూడో ప్రభుత్వం అవకాశం కల్పించింది.