Home » 2024
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే టాప్‌లో నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఆమె పార్టీ బూత, క్లస్టర్, యానిట్, ఇనచార్జిలు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగహన సదస్సు నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్ర మణలకు హద్దేలేకుండాపోయిందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి లో సోమవారం ప్రజా రెవెన్యూ దర్బార్-భూసమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతుల నుంచి అర్జీలను ీస్వీకరించారు.
నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ఎస్కే యూనివ ర్సిటీ అంతర్ కళాశాలల బి - గ్రూప్ టోర్నీలో పలు జట్లు విజయం సాధిం చాయి. నగరంలోని ఎస్ఎస్బీతఎన కళాశాలలో ఎస్కేయూ అంతర్ కళాశాలల గ్రూప్- బి పోటీలు ఆదివారం నిర్వహించారు.
శింగనమల చెరువు మరవ వద్ద ప్రమాణి కులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం చంద్రబాబు నాయుడును కో రారు. ఆమె ఆదివారం మంగ ళగిరిలోని టీడీపీ కార్యాల యంలో సీఎం చంద్రబాబును కలసి, నియోజకవర్గంలో చేప ట్టవలసిన అభివృద్ధి పనులపై విన్నవించారు.
రానున్న బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లాకు తాగు, సాగునీటి సాధన కోసం ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టామని, యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపపట్టను న్నట్లు తెలిపారు.
వైసీపీ హయాంలో జా నెడు రోడ్డు వేయలేకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటేవని ఎమ్మెల్యే పరిటాల సునీ త ఘాటుగా విమర్శించారు. మండలం లోని ఆలమూరులో ఆదివారం మధ్యా హ్నం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్ర మంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా
సీనియర్ మహిళల జాతీయ స్థాయి పుట్‌బాల్ రాజామాత జీజాబాయి ట్రోఫీ పోటీలు ప్రారంభ మయ్యాయి. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో శనివారం రాజామాత జీజీబాయి సీనియర్ మహిళల జాతీయస్థాయి పుట్‌బాల్ పోటీలను ఏపీ పుట్‌బాల్ అసోసియేషన జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్ ప్రారంభించారు.
జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు.