MLA SHRAVANISHREE : చెరువు మరవ వద్ద బ్రిడ్జి నిర్మించండి
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:50 PM
శింగనమల చెరువు మరవ వద్ద ప్రమాణి కులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం చంద్రబాబు నాయుడును కో రారు. ఆమె ఆదివారం మంగ ళగిరిలోని టీడీపీ కార్యాల యంలో సీఎం చంద్రబాబును కలసి, నియోజకవర్గంలో చేప ట్టవలసిన అభివృద్ధి పనులపై విన్నవించారు.
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వినతి
శింగనమల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శింగనమల చెరువు మరవ వద్ద ప్రమాణి కులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం చంద్రబాబు నాయుడును కో రారు. ఆమె ఆదివారం మంగ ళగిరిలోని టీడీపీ కార్యాల యంలో సీఎం చంద్రబాబును కలసి, నియోజకవర్గంలో చేప ట్టవలసిన అభివృద్ధి పనులపై విన్నవించారు. ఎక్కువగా వర్షా లు వచ్చినప్పడు జిల్లాలో అతి పెద్దదైన శింగనమల శ్రీరంగరాయచెరువు నిండి వరదనీరు నెలలు పాటు పారుతుందని, దీంతో శింగనమల మండలం నుంచి అనంతపురం, తాడిప త్రికి రాకపోకలు నిలిచిపోతాయని సీఎంకు వివరించారు. దీంతో ప్రయాణి కులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరవ ప్రాంతంలో బ్రిడ్జి ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే నియోజకవ ర్గంలోని యల్లనూరు, పుట్లూరు, నార్పల, గార్లదిన్నె మండలల్లో 32 వేల ఎకరాల్లో చీనీ పంటలు సాగు చేస్తున్నారని, మంత్రి నారాలోకేశ యవగళం పాద్రయాత్రలో 800 కిలో మీటర్ల మైలురాయి వేసిన సందర్భంగా ఇక్కడ చీనీ ప్రాసెసింగ్ యానిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానూకులంగా సృందించి శింగనమల చెరువు మరవ వద్ద బ్రిడ్జి, గార్లదిన్నె మండలం మర్తాడు వద్ద ప్రాసెసింగ్ యానిట్‌కు నిధులు ఇస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....