MLA SUNITA : వైసీపీ హయాంలో భూ ఆక్రమణలకు హద్దేలేదు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:17 AM
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్ర మణలకు హద్దేలేకుండాపోయిందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి లో సోమవారం ప్రజా రెవెన్యూ దర్బార్-భూసమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతుల నుంచి అర్జీలను ీస్వీకరించారు.
ప్రజారెవెన్యూ దర్బార్‌లో ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్ర మణలకు హద్దేలేకుండాపోయిందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి లో సోమవారం ప్రజా రెవెన్యూ దర్బార్-భూసమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతుల నుంచి అర్జీలను ీస్వీకరించారు. మండలంలోని అ న్ని గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి సమస్యలను విన్నవించారు. ఇందులో ఎ క్కువగా... భూములను ఆనలైనలో మరొకరి పేరుపై మార్చుకుని కబ్జా చేయడం పై ఫిర్యాదులు అందాయి. రైతు ప్రమేయం లేకుండా మరొకరికి ఆనలైనలో ఎలా మార్చుతారని ఆమె ఆరాతీశారు. మరికొందరు భూ సరిహద్దు సమస్యలు, జగనన్న భూసర్వేలో పెద్దఎత్తున జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల వచ్చాయి. మొత్తం 178 మంది రైతులు ఫిర్యాదులను అర్జీల రూపంలో అందజేశారు. వీటిలో కొన్నింటికి అక్కడికిక్కడే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ఆధికారులను ఆదేశించారు. మిగిలిన సమస్యలకు సమగ్రంగా సర్వే చేసి తగిన చర్యలుతీసుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ...వైసీపీ నాయకులు ప్రజలకు మంచి చేయడం అటు ఉంచితే అమాయక రైతుల పొలాలను కాజేశారని మండిపడ్డారు. నియో జకవర్గంలో ఎక్కువగా ఇలాంటి భూ ఆక్రమణలు ఉన్నాయని, చాలా మంది రైతులు భూముల సమస్యలు తమ దృష్టికి తెచ్చారన్నారు. అందుకే ప్రజా రెవెన్యూ దర్బార్ నిర్వహించామని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....