Home » 2024
సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది.
రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేటితరం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో గురువారం వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పాతూరు పవర్ ఆఫీస్ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తి ...
మండలంలో గురువా రం పల్లె పండుగ వర్షంలోనూ కొనసాగింది. టీడీపీ మండల నాయకు లు, అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సోములదొ డ్డి, పాపంపేట, ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
లోకకల్యాణం కోసం శా రదానగర్లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.
రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. సాగు చేసిన పంట చేతికందే వరకు కష్టంగా మారుతోంది. ఓవైపు చీడపురుగులు, రోగాలు మరోవైపు ప్రకృతి వైఫరీత్యాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలిగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయి. ఖరీ్‌ఫలో బోర్లు, వర్షాధారంగా సాగుచేసిన పంటలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో పండిన పంటను ఇంటికి తెచ్చుకోలేకపోతున్నారు. చేనులోనే పంటలు నీట మునుగుతున్నాయి. కోసిన పంటను నూర్పిడి చేసుకోలేక, ఆరబెట్టుకోలేక ...
మండలంలోని ఒంటికొండ గ్రామంలో ప్రధాన రహదారపైపై వర్షపు నీరు నిలిచి మడుగును తలపిస్తోంది. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుం డటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్డుపై పెద్దఎత్తున నీరు నిలిచింది.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపా రు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ని గొం దిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గొందిరెడ్డిపల్లిలో రూ. 14.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రూ. లక్ష సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
జాతీయ రహదారి పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని శింగనమల రహదారి పోరాట సమితి సభ్యులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పలు మార్లు అధికారులకు ప్రయోజనం లేకపోయిందన్నారు. గంటపాటు ధర్నా చేపట్టారు.
కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి జాడ మొదలైందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.60లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడి వాన కురుస్తున్న స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చ బోతోం దని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు.