MLA : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:18 AM
మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా ఏన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల (మిడ్‌పెన్నార్) డ్యాం లోకి సోమవారం మిషన ఫింగర్లింగ్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌ఐ) పథకం ద్వారా వివిధ రకాల 12 లక్షల చేపపి ల్లలను వదిలారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ.... ఎంపీఆర్ డ్యాంలో చేపపిల్లల విడుదల
గార్లదిన్నె, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా ఏన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల (మిడ్‌పెన్నార్) డ్యాం లోకి సోమవారం మిషన ఫింగర్లింగ్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌ఐ) పథకం ద్వారా వివిధ రకాల 12 లక్షల చేపపి ల్లలను వదిలారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్‌తో కలసి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ డ్యాం నీటిలోకి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో నామమా త్రంగా ఎనిమిది లక్షల పిల్లలు మాత్రమే వదిలి చేతు లు దులుపుకున్నారన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇ న్సూరెన్సలు గానీ, బోట్లు, నెట్లు తదితరాలు ప్రభుత్వం నుంచి అందకుండా చేశారని ఆరోపించారు. మిడ్ పె న్నార్ డ్యాంపై ఆధారపడి జీవనం సాగించే సుమారు 300 మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ ప్రభుత్వంలో పట్టించు కోలే దన్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్ర భుత్వం మత్స్యకారులకు అన్ని సహా య సహకారాలు అందించిం దన్నా రు. అలాగే ఇప్పుడు ఆదుకుంటా మని తెలిపారు. అదేవిధంగా ఎంపీ ఆర్ డ్యాంను పర్యాటకంగా అభివృద్ధి చేసి పూర్వవైభం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచు ఉషారాణి, సౌతకెనాల్ డీసీ చైర్మన చంద్రశేఖర్, తహసీల్దార్ బండారు ఈరమ్మ, ఎం పీడీఓ యోగానందరెడ్డి, ఎంఈఓ తారా చంద్రానాయక్, ఈఓఆర్డీ దామోదరమ్మ, మత్స్యశాఖ ఎఫ్‌డీఓలు ఆషీఫ్, లక్ష్మినారాయణ, మత్స్యశాఖ సంఘం జిల్లా అధ్యక్షులు నాగేష్, పాండు, నరసింహారెడ్డి, వెంకట్రామిరెడ్డి, చితంబ రప్ప, సురేష్, వడ్లరాము, చల్లా నాగరాజు, సామాల మ ధు, ఎర్రిస్వామి, సుబ్బు, వెంకటేష్, వెంకట్రాముడు, రామాంజి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....