Home » Andhrajyothi
అనంత శయన విష్ణు, ద్వారకా తిరుమల, వినాయక రథోత్సవం, ఆబాల గోపాలుడు... అన్నీ తాత్విక రేఖలే. చిత్రకళా రంగంలో ‘కాలిగ్రఫీ’ అనేది ప్రత్యేకమైన శైలి. పెన్నుతోగానీ, బ్రష్తో గానీ ఒక పద్ధతిలో అక్షరాలను చెక్కినట్టుగా, ఫ్రీహ్యాండ్గా బొమ్మలను గీయాల్సి ఉంటుంది.
రూబిక్స్ క్యూబ్ రంగులను ఒకవైపు చేర్చడం అందరికీ ఓ సరదా. అయితే అది అందరికీ సాధ్యపడదు. దానికి కూసింత తెలివి, ఓర్పు అవసరం. సాధారణంగా రూబిక్స్ క్యూబ్ అరచేతిలో పట్టేంత ఉంటుంది. అలాంటిది దాని పరిమాణంలో వెయ్యోవంతు అంటే... వేలి గోరుపై నిలిపేంత బుల్లి క్యూబ్ను సాల్వ్ చేయడమంటే మాటలా?
సాధారణ పరిశీలకుల దృష్టిలో గద్దర్ ఒక పాట కవి, ఒక విప్లవ కవి. బహుజన ఉద్యమ కాలానికి మొదట పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షంగా మద్దతిచ్చిన పోరాటశీలి. ఇంకా కొంచెం విస్తృతంగా పరిశీలన చేసిన వారి దృష్టిలో గద్దర్ 1980ల నుండి తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సాంస్కృతిక విప్లవ సైనికుడు.
చిన్నారిని స్కూలునుంచి ఇంటికి తీసుకురావటానికి సాధారణంగా తల్లి లేదా తండ్రి వెళ్తారు. కొందరు పిల్లలు స్కూల్ బస్సులోగానీ, ఆటోలోగానీ ఇంటికి చేరుతారు. అయితే చైనాలో కిండర్గార్టెన్ చదివే ఒక చిన్నారిని మాత్రం స్కూల్కు తీసుకొచ్చేది, తీసుకెళ్లేది ఒక కుక్క అంటే ఆశ్చర్యమేస్తుంది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ‘ఐస్లాండ్’. చుట్టూ నలువైపులా అంతు లేని జలనిధి. ఓ వైపు మంచు పర్వతాలు, మంచు ఖండాల నుంచి ప్రవహించే నదులుంటే... మరో వైపు అగ్ని పర్వతాలు, అవి విరజిమ్మే లావా ఆశ్చర్యపరుస్తాయి. ఆ విశేషాలే ఇవి...
పిల్లల అవసరాలు తీర్చడానికి, వారికి సంబంధించిన పనిని మరింత సులభతరం చేసేందుకు చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వేళ్లు నొప్పి పెట్టకుండా పెన్సిల్ గ్రిప్పర్, ఏటీఎం లాంటి పిగ్గీబ్యాంక్... ఇలాంటి కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇవి...
ప్రకృతి పచ్చదనంతో పాటు పూలపరిమ ళంతో గుబాళిస్తుంది. పువ్వుల్లో కొన్ని దైవాన్ని చేరితే, మరికొన్ని మహిళల సింగారంలో సేదతీరుతాయి. ఇంకొన్ని అత్తర్లు, ఔషధాల్లో పనికొస్తాయి. సాధారణంగా ఏ పూల ధరైనా సరే వంద రూపాయల్లోపే ఉంటుందనుకుంటారు...
టీ వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. బ్లాక్ టీ, గ్రీన్ టీలు ఎక్కువ ప్రాచుర్యం పొందినవి. టీని బ్లాక్ టీ, గ్రీన్ టీ లా కాకుండా పాలతో పాటు తీసుకుంటే పాలలోని కేసిన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ శరీరానికి అందకుండా చేస్తాయి. కాబట్టి టీ ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో పాలు, చక్కెర కలపకుండా తీసుకోవడం ఉత్తమం.
- రాయలసీమలోని చిన్న పల్లె. రైతులు అక్కడ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. టమాటా మొక్కలు నాటే ముందు పొలంలో బెడ్స్ వేసి, వాటిమీద పాత చీరలు పరుస్తున్నారు! - దంతేవాడ (ఛత్తీస్ఘడ్) దండ కారణ్యంలో గిరిజన మహిళలు ఇప్ప చెట్ల చుట్టూ చీరలు కడుతున్నారు.
రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినా..