Home » Asia cup 2023
పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
కొలంబో వేదికగా ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. ఆదివారం నాడు కొలంబోలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుందని.. మ్యాచ్ జరిగే రోజు సుమారు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు.
ఆసియా కప్ కారణంగా తాము భారీగా నష్టపోయామని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆసియా కప్ కౌన్సిల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. హైబ్రిడ్ మోడల్ అని ప్రతిపాదన వచ్చిన తర్వాత తాము ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని చెప్పామని.. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగానే శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుందని పీసీబీ మండిపడుతోంది.
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు.
సూపర్-4కు వెళ్లాలంటే శ్రీలంక విధించిన 292 పరుగుల టార్గెట్‌ను ఆప్ఘనిస్తాన్ 37.4 ఓవర్లలో ఛేదించాలి. ఈ లెక్కను దృష్టిలో పెట్టుకునే ఆప్ఘనిస్తాన్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ ఫారుఖీ చేసిన పనితో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అతడు డిఫెన్స్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాడు. భారీ షాట్లు కాదు కదా కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. చివరకు 38వ ఓవర్ నాలుగో బంతికి ఫారుఖీ అవుట్ కావడంతో ఆప్ఘనిస్తాన్ ఆలౌటైంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.
India vs Pakistan మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడితేనే మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడతారు.
ఆసియా కప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌పై టీమిండియా సునాయసంగా గెలిచింది. వర్షం కలవరపెట్టినప్పటికీ లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
అంతర్జాతీయ కెరీర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 26 వన్డేలు ఆడి 511 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ కేవలం 24.33. అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక స్కోరు 64. అంతేకాకుండా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా హ్యాట్రిక్ డకౌట్లను సాధించాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో డకౌట్ స్టార్ అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
బయటి వారు ఏం మాట్లాడుకున్నా తాము పట్టించుకోమని, తనను ఇంకోసారి అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు.