Home » BRS
రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్‌కు పోయాయని హరీష్‌రావు ఆరోపించారు.
ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట.. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట.. బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ విమర్శించారు.
దళిత బంధు రాని వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో విడత దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకోకు పిలుపునిచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బుద్ధి,జ్ఞానం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇరవైఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఎన్నడైనా ఫ్లోరైడ్ బాధితులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. జలసాధన సమితి ధర్నాలో కోమటిరెడ్డి ఎప్పుడైనా పాల్గొన్నారా అని నిలదీశారు.
సుంకిశాలలో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం చేసిన మేఘా కంపెనీకి పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మేఘా మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నా కమ్యూనిస్ట్‌లు తమతో కలిసి వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయకుంటే తనకు జన్మనే లేదని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.