Share News

Today Breaking News: అల్లు అర్జున్ కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - Dec 21 , 2024 | 10:17 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.

Today Breaking News: అల్లు అర్జున్ కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Breaking News

Live News & Update

  • 2024-12-21T14:55:59+05:30

    అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై రాజకీయం ఏమిటి

    • అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

    • బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించలేదు

    • అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించడానికి ముందుకు రాలేదు

    • సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారు

    • అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూకట్టి నన్ను తిడుతున్నారు

    • అల్లు అర్జున్‌కు కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా

    • సినిమా వాళ్లపై నాకు కోపం ఎందుకు ఉంటుంది

    • సినిమా వాళ్లు బాధ్యతగా వ్యవహారించాలి

    • అల్లు అర్జున్ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు

  • 2024-12-21T14:41:32+05:30

    అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలకు రేవంత్ సమాధానం

    • సంథ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతుందన్న సీఎం రేవంత్

    • పోలీసుల వైఫల్యం లేదన్న రేవంత్

    • పోలీసులు హెచ్చరించినా హీరో సినిమాకు వచ్చారన్న సీఎం

    • పోలీసులు ఎలాంటి లాఠీఛార్జ్ చేయలేదన్న సీఎం రేవంత్

    • రోడ్ షో చేయడంతోనే తోపులాట జరిగింది

    • హీరో రోడ్ షో చేయకుండా వెళ్లిపోయిఉంటే పరిస్థితి వేరేలా ఉండి ఉండొచ్చు

    • అల్లు అర్జున్ బౌన్సర్లు ఫ్యాన్స్‌ను తోచేశారు

    • బౌన్సర్లు ఫ్యాన్స్‌ను తోయడంతో తోపులాట జరిగింది

    • కన్న బిడ్డ చేతిని పట్టుకుని తల్లి చనిపోయింది

    • ప్రస్తుతం పిల్లాడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు

    • థియేటర్‌ లోపల బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నుంచి హీరోపై ఎగపడే ప్రయత్నం చేశారు

    • పోలీసులను హీరో దగ్గరకు వెళ్లకుండా థియేటర్ యాజమాన్యం అడ్డుకుంది

    • పోలీసులు హీరోకు సమాచారం ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు

    • హీరోకు సమాచారం ఇచ్చినా సినిమా పూర్తయ్యే వరకు బయటకు వెళ్లబోనని హీరో చెప్పారని పోలీస్ కమిషనర్ చెప్పారు

    • థియేటర్ బయటనుంచి వచ్చిన తర్వాత ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పినా రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు

    • పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడన్న సీఎం రేవంత్

  • 2024-12-21T14:39:20+05:30

    అల్లు అర్జున్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ..

    • అల్లు అర్జున్ వ్యవహారాన్ని శాసనసభలో ప్రస్తావించిన అక్బరుద్దీన్ ఓవైసీ

    • పుష్ప-2 మూవీ సందర్బంగా జరిగిన తొక్కిసలాటపై మాట్లాడిన ఓవైసీ

    • ఓ మహిళ మృతి చెందినా హీరో సినిమా చూసి వెళ్లారు

    • దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారు

    • అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంగా వ్యవహారించారు

    • ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

    • ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి

    • పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఓవైసీ

  • 2024-12-21T14:32:19+05:30

    రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    బీఆర్‌ఎస్ నేతలు దొంగలకు సంచులు మోసేవాళ్లు

    బీఆర్‌ఎస్ నేతలు విధ్వంసకారుల్లా తయారయ్యారు

  • 2024-12-21T14:14:20+05:30

    బీఆర్‌ఎస్‌దే ఆ పాపం.. శాసనసభలో రేవంత్

    • ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం పాపం బీఆర్‌ఎస్‌దే

    • బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిన అప్పులతో ఇప్పుడు పథకాలు అమలు చేయలేకపోతున్నాం

  • 2024-12-21T14:12:53+05:30

    శాసనసభలో రేవంత్

    • మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లు కష్టపడి కూలేశ్వరం కట్టారు

    • ప్రతి పనిలో అవినీతికి పాల్పడ్డారు

    • బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులవల్ల ఇప్పుడు పథకాలు అమలు చేయలేకపోతున్నాం

  • 2024-12-21T13:48:20+05:30

    శాసనసభలో రేవంత్

    • వెనక్కి తిరిగి చూసుకుంటే బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏం జరిగిందో తెలుస్తుంది

    • వాళ్ళ పదేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రూ.16, 909 కోట్లు

    • బీఆర్‌ఎస్ ఇచ్చింది వడ్డీకే సరిపోయింది

    • 21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది

  • 2024-12-21T13:38:18+05:30

    శాసనసభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    • మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్

    • బీఆర్‌ఎస్ పదేళ్ల పాపాలను ప్రజలకు చెప్పాలి

    • బీఆర్‌ఎస్ పాపాలు చదవడం శిక్షగా మారింది

    • ఈ శిక్ష నాకు వద్దు

    • పదేళ్లు చేసిన పాపాలు చేదుగానే ఉంటాయి

    • వాటిని ప్రతిపక్ష సభ్యులు వినాల్సిందే

    • అన్ని కడుపు కట్టుకుని.. అభివృద్ధి పనులు ఆపి రుణమాఫీ చేశాం

    • మమల్ని ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

  • 2024-12-21T11:11:53+05:30

    విద్యార్థులకు గాయాలు

    • నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు గాయాలు

    • విశ్వవిద్యాలయంలో నీలగిరి హాస్టల్ బాత్రూం లో పై పెచ్చులు ఊడి పడి విద్యార్థి తలకి గాయాలు

  • 2024-12-21T10:20:35+05:30

    రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే

    • తెలంగాణ శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ

    • చర్చను ప్రారంభించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • సంక్రాంతికి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బుల జమ

    • రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు సేకరించామన్న మంత్రి తుమ్మల

  • 2024-12-21T10:17:17+05:30

    శాసనసభ ఆలస్యంపై హరీష్‌రావు అభ్యంతరం

    • శాసనసభ ఆలస్యంగా ప్రారంభం కావడంపై హరీష్‌రావు ఆగ్రహం

    • ప్రతిరోజు సభ 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతుందన్న హరీష్‌రావు

    • తమ హయాంలో సభ సమయానికి ప్రారంభమయ్యేది