Minister Komati Reddy: చర్చకు రా.. నిరూపించు..హరీష్‌రావుకు మంత్రి వెంకట్ రెడ్డి సవాల్
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:53 AM
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
హైదరాబాద్: ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే సభ ముందుకు తెలంగాణ మున్సిపాలిటీల 2024 బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ భూ భారతి బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కరెంట్ సమస్యపై అసెంబ్లీలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఒక సబ్ స్టేషన్ వెళ్లి లాగ్ బుక్ చేశానని గుర్తుచేశారు. 10గంటలు మాత్రమే కరెంట్ వస్తుందని సబ్ స్టేషన్ సిబ్బంది చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 24గంటల కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. 24గంటల కరెంటు ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఉపసంహరించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేసి పదేళ్లు పాలించారన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని ప్రశ్నించారు. నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలో కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుణ్యాన AMRB వచ్చిందని గుర్తుచేశారు.
బావ బామ్మర్ది అడ్డు పడుతున్నారు..
బావ బామ్మర్ది హరీష్‌రావు, కేటీఆర్ కలిసి నల్గొండ ప్రజలను చంపేస్తారా.. చంపేయండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీని బాగుచేస్తున్నారని అన్నారు. దానికి కూడా బావ బామ్మర్ది అడ్డు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహించారు. రైతు భరోసాపై సూచనలు చేయాలని కోరారు. కేటీఆర్ ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని.. మరి బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. దళితుడిని సిఎం చేస్తామని చెప్పి మోసం చేయలేదా అని నిలదీశారు. ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పకండి అని అన్నారు.. అబద్దాల మేనిఫెస్టో మీది. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరం కట్టారని విమర్శించారు.. రైతు భరోసాపై సలహాలు, సూచనలు ఉంటే చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొఃన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు
MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు
Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...
Read Latest Telangana News and Telugu News
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు
MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు
Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...
Read Latest Telangana News and Telugu News