Home » Chandra Babu
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచే వాహనాలను అడ్డుకుంటూ పోలీసులు హడావుడి చేస్తున్నారు. విజయవాడలోకి రాకుండా వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డు పెట్టి పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ జామ్ చేశారు. అంబులెన్స్ లను సైతం పోలీసులు వదలడం లేదు.
బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటికి చీర.. జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు వెళ్లారు. సుకన్య, సంజనాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
చాలా బాధాకరం. యుగపురుషుడు... ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రామోజీరావు చివరి శ్వాస వరకూ సమాజహితం కోసం పని చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేశారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఉద్యాన రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. హార్టికల్చర్ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యాన రైతులకు జగన మొండి చేయి చూపారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఉద్యాన రైతులకు పలు రకాల రాయితీలను అందించి ఆదుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించింది. రైతుల్లో కొందరికే లబ్ధి చేకూరింది. ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరిగింది. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో 50 శాతానికిపైగా నిధులను తగ్గించారు. ఐదేళ్లుగా అరకొరగా విధించిన టార్గెట్లకూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో రైతులకు సరైన సమాధానం ...
ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా రేషన్ డీలర్లకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపించిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు (Divi Leela Madhav Rao) అన్నారు. నాలుగు దశాబ్దాల రేషన్ డీలర్ల (Ration Dealers) చరిత్రలో ఎప్పుడూ పడని నరకాన్ని జగన్ హయంలో అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.